అక్కడ ఫుడ్ చాలా చీప్…రాశి ఖన్నా..!

-

  1. అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాశి ఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత అనేక టాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే రాశి ఖన్నా ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘థాంక్యూ’ సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం యూనిట్ అంతా కూడా రష్యాలోని మాస్కోలో ఉంది. అయితే తాజాగా మాస్కో లో ఉన్న రాశి ఖన్నా లైవ్ లోకి వచ్చింది. షూటింగ్ స్పాట్ నుండి రాశి ఖన్నా తన అభిమానులను పలకరించింది.

మాస్కో లోని కొన్ని అందాలను , భవనాలను చూపించింది. ఇక రాశి ఖన్నా సినిమాలు, షూటింగ్‌ల అప్డేట్ ల గురించి చెప్పుకొచ్చింది. ఇంక రెండు మూడు రోజుల్లో మాస్కో నుంచి బయల్దేరుతామని, ఇక చెన్నైకి వెళ్తాను అని రాశీ ఖన్నా తెలియజేసింది. అలాగే మాస్కో నగరం లో ఎన్నో చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి అని ఇక్కడ ఫుడ్ ధర చాలా చీప్ అని తెలియజేసింది. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఇది సరైన ప్రదేశం అని రాశి ఖన్నా తెలియజేసింది. ఇక ఈ ప్రదేశంలో చాలా ఎంజాయ్ చేశాను అని తనలోని చిన్న పిల్ల బయటకు వచ్చింది అని రాశి ఖన్నా తెలియజేసింది. అలాగే ఇంకో రెండు మూడు రోజుల్లో మాస్కో నుంచి బయల్దేరుతామని, ఇక చెన్నైకి వెళ్తాను అని రాశీ ఖన్నా తెలియజేసింది. అక్కడ సర్దార్ షూటింగ్‌లో పాల్గొనాలని రాశి ఖన్నా చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news