కరీంనగర్: ‘అభివృద్ధిని చూసే బిజెపిలో చేరుతున్నారు’

పట్టణంలోని ఎంపీ కార్యాలయంలో కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర బండి సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఆధ్వర్యంలో 100 మంది బీజేపీలో చేరారు. వారికి బండి సంజయ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కేంద్రపాలన చూసే పార్టీలో చేరుతున్నారన్నారు. జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, కొత్తపల్లి పట్టణ అధ్యక్షుడు కేంచ శేఖర్ తదితరులు పాల్గొన్నారు