![accident](https://cdn.manalokam.com/wp-content/uploads/2022/01/accident.jpg)
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి – పత్తిపాక శివారు మధ్యలో 11 కేవీ విద్యుత్ తీగలు తెగిపడి, లచ్చయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. మృతునిది ధర్మారం మండలం నర్సింగపూర్ గ్రామం. 11 కేవీ విద్యుత్ తీగలు తగలడంతో ద్విచక్రవాహనంతో సహా వ్యక్తి సజీవదహనం అయ్యాడు. ధర్మారం పోలీసులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.