
శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 22 నుంచి 30 వరకు బీఫార్మసీ 5వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష సమయమని పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ కళాశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశామన్నారు.