కరీంనగర్: ‘విదేశాలకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది

కరీంనగర్: విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం, పర్యాటక ప్రాంతాల సందర్శన కోసం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఉన్నత విద్య అభ్యసించడానికి అమెరికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఇతర దేశాలకు వెళ్తున్న వారి సంఖ్య గణనీయంగా ఉంది. ఆయా దేశాల్లో భారతీయులు ఎన్ఆర్ఐలుగా స్థిరపడుతున్నారు. అక్కడ వాహనాలు నడపాలంటే లైసెన్స్ తప్పనిసరి కావడంతో ఇక్కడ అంతర్జాతీయ లైసెన్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.