కరీంనగర్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు 46 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో 12, కరీంనగర్ 17, సిరిసిల్ల 10, పెద్దపల్లి జిల్లాలో 7 కేసులు నమోదైనట్లు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. కరోనా కట్టడికి సహకరించాలని కోరారు.