ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా ఉధృతి ఇలా..

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బుధవారం 232 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో 41, కరీంనగర్ 102, పెద్దపల్లి 51, సిరిసిల్ల జిల్లాలో 38 కేసు నమోదైనట్లు చెప్పారు. ఓమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు.