ములుగు జిల్లాలో ఈ నెల 18న ప్రభుత్వ సెలవును కలెక్టర్ కృష్ణ ఆదిత్య ప్రకటించారు. 16 నుంచి 19 వరకు మేడారం జాతర జరగనుంది. ఈ సందర్భంగా 16, 17 తేదీల్లో ములుగు జిల్లా పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలకు, 18న జిల్లా మొత్తం లోకల్ హాలిడేను ప్రకటించారు. విద్యా సంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. మార్చి 12(రెండో శనివారం) పనిదినంగా నిర్ణయించారు.