ప్రతిఏటా భక్తులు ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ మహా శివరాత్రి. మార్చి 1వతేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్ర పరిధిలో ఘనంగా ఏర్పాట్లు ప్రారంభించారు. ఫసల్వాది గ్రామ శివారులో గల జ్యోతివాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలు సోమవారం ఘనంగా ప్రారంభించారు. శివరాత్రికి ఒకరోజు ముందుగానే ఎంతో అద్భుతంగా 18 అడుగుల ఎత్తుతో లింగేశ్వరాన్ని స్థాపించారు