ఉమ్మడి మెదక్ జిల్లాలో పెరుగుతున్న కేసులు.

తెలంగాణ కోవిడ్ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఉమ్మడి జిల్లాలో 135 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో 78, సిద్దిపేటలో 36, మెదక్‌లో 21 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి విధిగా మాస్కులు ధరించాలని వైద్యాధికారులు సూచించారు.