కరోనా సోకకుండా.. అంబానీ కంటే అందరూ ఎక్కువ సంపాదించాలి : ఆర్జీవీ సంక్రాంతి ట్వీట్

నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇక పండుగ నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం జగన్, సీఎం కేసీఆర్ లు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తనదైన స్టైల్ లో.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ముఖేష్ అంబానీ కంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలని కోరుకుంటున్నట్లు చాలా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు వర్మ.

RGV Sensation Tweet about his Birthday

“అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరియు భగవంతుడు మీలో ప్రతి ఒక్కరికి పెద్ద ఇల్లు మరియు ముకేష్ అంబానీ కంటే ఎక్కువ డబ్బుని ఇవ్వాలి. ప్రస్తుతం లేదా భవిష్యత్తులో మీకు ఎలాంటి వైరస్ సోకకుండా ఉండాలి. పురుషులందరూ ప్రపంచంలోనే అత్యంత అందమైన స్త్రీని పొందాలి. అందరు స్త్రీలు అత్యంత అందమైన వ్యక్తిని పొందాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు వర్మ. ” భర్తలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరియు మీ భార్యలు మిమ్మల్ని ఎప్పటికీ బాధించకూడదని మరియు మీరు ఏమి చేసినా లేదా మీరు ఏమి చేయకపోయినా వారు ఓకే చేస్తారని దేవుడు మీ కోరికను ప్రసాదిస్తాడు” అంటూ మరో ట్వీట్ చేశారు వర్మ. ప్రస్తుతం వ్వ ట్వీట్ వైరల్ గా మారింది.