రంగారెడ్డి : రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు

cyber crime

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వరుస కేసులతో హడలెత్తిస్తున్నారు. మహేష్ బ్యాంక్ సర్వర్ హ్యాక్ చేసి రూ.12కోట్లు కాజేసిన ఘటన మరువకముందే సంతోష్ నగర్‌కి చెందిన వరప్రసాద్ అనే వ్యక్తి మెయిల్ హ్యాక్ చేసి రూ.46లక్షలు స్వాహా చేశారు. అలాగే శ్రీనగర్‌కి చెందిన రిటైర్డ్ ఉద్యోగి కేశవరావుకు కోటి రూపాయల లోన్ అని రూ.18లక్షలు కొట్టేశారు. బాధితుల ఫిర్యాదుపై సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.