సంగారెడ్డి: దళితబంధు నిధులు జమచేశాం

ప్రతి నియోజకవర్గంలో 100 మందికి దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన దళితబంధు నిధులు ఇప్పటికే సంగారెడ్డి కలెక్టర్ ఖాతాలో జమ చేశామని మంత్రి స్పష్టం చేశారు. లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియ ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తివుతుందన్నారు. మార్చి మొదటి వారంలో యూనిట్ల గ్రౌండిగ్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.