ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీగా కేసులు

ఉమ్మడి జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సోమవారం విడుదల చేసిన బులెటిన్ లో భాగంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 221 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 91, సిద్దిపేట జిల్లాలో 84, మెదక్ జిల్లాలో 46 చొప్పున నమోదయ్యాయి. థర్డ్ వేవ్, ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతి నేపథ్యంలో ప్రజలు అజాగ్రత్తగా ఉండొద్దని, విధిగా మాస్కులు ధరించాలని వైద్యాధికారులు సూచించారు.