మెదక్.. గన్ పేలి బాలిక మృతి

 

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఎయిర్ గన్ పేలి బాలికకు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాన్వి (4) అనే బాలిక మృతి చెందినట్టు పటాన్ చెరు డిఎస్పి భీమ్ రెడ్డి తెలిపారు. ప్రమాదంపై విచారణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.