సంగారెడ్డి: కంటైనర్‌ను ఢీకొట్టిన కారు..ఒకరు మృతి

accident

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.