మెదక్ జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: కలెక్టర్

జిల్లా ప్రజలు సంక్రాంతి పండగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కలెక్టర్​ హరీశ్​ అన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆయన సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. పండగను కుటుంబ సభ్యులంతా కలిసి సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. సంక్రాంతి ప్రతిఒక్కరి జీవితాల్లో నూతన కాంతి తీసుకురావడంతో పాటు జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షించారు.