చిరంజీవికి సీఎం జగన్ బంపర్ ఆఫర్.. వైసీపీ తరఫున రాజ్యసభ టికెట్ ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తో నిన్న టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి సమావేశం అయిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య సినిమా టిక్కెట్ల ధరల వివాదం కొనసాగుతోంది. అయితే ఈ వ్యవహారంపై చర్చించేందుకు ప్రత్యేకంగా సీఎం జగన్ ను కలిశారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు ఇరువూరు.

అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే చిత్ర పరిశ్రమ సమస్యలతోపాటు ఏపీ రాజకీయాలపై కూడా చర్చ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవికి రాజ్యసభ టిక్కెట్ ఇచ్చేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ విషయంపై చిరంజీవికి సీఎం జగన్ నిన్న చెప్పినట్లు తెలుస్తోంది. మరో నాలుగు నెలల్లోనే ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి.

అందులో ఒక సీటు చిరంజీవికి ఇవ్వాలని ఇప్పటికే సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారట. దీనికి చిరంజీవి అంగీకరిస్తే… కాపు ఓట్లన్నీ వైసీపీకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు స్కెచ్ వేశారట సీఎం జగన్. అలాగే జనసేన పార్టీకి కూడా దీని ద్వారా చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారట. అయితే దీనిపై చిరంజీవి… తనకు కాస్త సమయం కావాలని కూడా జగన్ను కోరారట. అయితే దీనిపై త్వరలోనే కీలక ప్రకటన రానుందని సమాచారం అందుతోంది.