కెసిఆర్ బాటలో స్టాలిన్.. తమిళనాడులోనూ “కల్యాణలక్ష్మి” పథకం ప్రారంభం

-

తెలంగాణ రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావును తమిళనాడు రాష్ట్ర సీఎం స్టాలిన్ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. పేదింటి ఆడబిడ్డలు పెండ్లి కోసం తల్లిదండ్రులు అప్పులపాలు కాకుండా మేనమామ బాధ్యతలు స్వీకరించిన సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పేరుతో ఓ బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆడబిడ్డ కు పెండ్లి కోసం కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ప్రభుత్వం తరపున లక్ష 116 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారు.

తెలంగాణ కళ్యాణలక్ష్మి పథకం ప్రేరణతో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గురువారం ఆడబిడ్డల పెళ్లిళ్ల పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా బిడ్డ పెళ్లి కోసం చేసే వధువు కుటుంబానికి ఆర్థిక సహాయం తో పాటు 8 గ్రాముల బంగారు కాసు అందజేస్తారు. 94 వేల మందికి పైగా అమ్మాయిల వివాహానికి… ఏకంగా 750 కోట్లు కేటాయించింది తమిళనాడు సర్కారు. అలాగే రిటైర్డ్ పురోహితుల పింఛన్ పథకాన్ని కూడా ఆయన తాజాగా ప్రారంభించారు. గతంలో 3000 ఉన్న పురోహితుల పింఛను నాలుగు వేలకు పెంచారు. దీంతో తమిళనాడులో ఉన్న 1804 మంది పురోహితులు లబ్ధి పొందనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news