సంగారెడ్డి: చెరువులో అనుమానస్పదంగా మహిళ మృతదేహం

crime
crime

అందోల్ సమీపంలోని పెద్ద చెరువులోని పొదల్లో ఓ మహిళ మృతదేహం తేలి ఉండటాన్ని శుక్రవారం కొందరు స్థానికులు గుర్తించారు. వెంటనే జోగిపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై జయ శంకర్ అక్కడికి చేరుకుని, శవాన్ని వెలికి తీయించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయినందున గుర్తు తెలియడం లేదని, సుమారు 15 రోజుల క్రితం మరణించి ఉంటుందని, హత్యా, ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.