మేడ్చల్: యువతి అదృశ్యం

దుకాణానికి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోచోటు చేసుకుంది. బీహార్‌కు చెందిన జమాల్ 10 ఏళ్ల క్రితం బతుకుదెరువుకు కోసం మేడ్చలకు వచ్చి కుమ్మరిబస్తీలో తన చెల్లి రుక్సానా(20)తో కలిసి నివాసం ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం కిరాణా షాపుకు వెళ్తున్నానని ఇంటి నుండి వెళ్లిన రుక్సానా ఇంటికి రాలేదు. దీంతో అన్న జమాల్ మేడ్చల్ పోలీసులను ఆశ్రయించాడు.