రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన యువకుడు అజయ్ చిక్కుకున్నాడు. మిర్యాలగూడ పట్టణానికి చెందిన అజయ్ వైద్యవిద్య కోసం రష్యా వెళ్లాడు.
యుద్ధవాతావరణంతో ఇండియాకు తిరిగి రావటానికి సిద్ధంగా కాగా రష్యా ప్రభుత్వం విమానలను నిలిపివేయటంతో అక్కడే ఉన్నాడు. దీంతో మిర్యాలగూడలో అజయ్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. క్షేమంగా రావాలని కోరుతున్నారు.