రామప్ప దేవాలయానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కాకతీయుల శిల్ప కళా వైభవానికి ప్రతీక, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ తీర్థ యాత్రల పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి పథకం {ప్రసాద్} లో చేర్చింది. ఆ శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి దీనికి ఆమోదం తెలిపారు.
దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలోనే లేఖ పంపనున్నట్లు సమాచారం. ఆలయం వెలుపల అభివృద్ధి పనులు, మౌళిక వసతులకు సంబంధించి.. సమగ్ర ప్రాజెక్టు నివేదిక పంపాలని కేంద్ర పర్యాటక శాఖ రాష్ట్రాన్ని కోరనుంది. ఆ పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
భద్రాచలం ఆలయాన్ని కూడా ప్రసాద్ పథకంలో చేర్చిన సంగతి మనకు తెలిసిందే. రామయాణ సర్క్యూట్ కింద భద్రాచలం ఆలయాన్ని చేర్చారు. కాగా.. ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. జులైలో దీనికి యునెస్కో గుర్తింపు లభించింది.