సూర్యాపేట జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి నుంచి వర్షం దంచి కొడుతుంది. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎస్ వి ఇంజనీరింగ్ కళాశాల వద్ద గల కల్వర్టు కూలీ నీరు RK గార్డెన్ ప్రాంతంలోకి ప్రవహిస్తున్నది. పట్టణంలోని మానస నగర్ కాలనీ పూర్తిగా నీటమునిగింది. రియల్టర్లు ఇక్కడ బరితెగించి 30 ఫీట్ల నాలాను 12 ఫీట్లకే పరిమితం చేశారు.