కేటీఆర్ ఈ కార్ రేస్ పై స్పందించిన మంత్రి పొంగులేటి..!

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈ-కార్ రేసు కేసు లో క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఏసీబీ దర్యాప్తులో మేము జోక్యం చేసుకోమని తీర్పు సందర్భంగా పేర్కొంది. ఆ సమయంలో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కేటీఆర్ తరపు న్యాయవాది కోరగా.. ఆ విజ్ఞప్తిని ధర్మాసనం పరిగణలోకి తీసుకోలేదు. అయితే తన నమోదైన ఏసీబీ కేసును కొట్టివేయాలని సుప్రీంకోర్టులో ఆయన సవాల్ చేశారు. అంతకంటే ముందే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.

తాజాగా కేటీఆర్ చేసిన  ఈ కార్ రేసు కేసు పై ట్వీట్ పై  స్పందించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు.  చేసిన తప్పు ఒకటి రెండు ఆలస్యం అయినా బయటపడుతుందన్నారు. కోర్టులు వ్యవస్థల ముందు బల ప్రదర్శన చేయడం కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ నాయకులు మా టార్గెట్ కాదు. కేటీఆర్ తప్పు చేయకపోతే కోర్టుకు ఎందుకు వెళ్తారు అని ప్రశ్నించారు. తప్పులు ఒప్పులు తెల్చేది కోర్టులు. ఆ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news