హై కోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టేసినందుకే కాంగ్రెస్ వాళ్లు ఉరి శిక్ష వేసినట్లు ఫీల్ అవుతున్నారు : కేటీఆర్

-

హై కోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టేసినందుకే కాంగ్రెస్ వాళ్లు నాకు ఉరి శిక్ష వేసినట్లు సంకలు గుద్దుకుంటున్నారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడారు. చట్టాన్ని గౌరవించాలనే ఉద్దేశంతోనే నిన్న తాను ఏసీబీ విచారణకు హాజరయ్యానని తెలిపారు. కక్ష సాధింపు కేసు తెలిసి కూడా వెళ్లానన్నారు.

ఇక కొందరూ మంత్రులు అయితే న్యాయమూర్తుల్లా ఫీలవుతున్నారని సెటైర్లు వేశారు. న్యాయపరంగా ఈ అంశం పై పోరాటం చేస్తానని లాయర్లతో విచారణకు వెళ్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. లాయర్ల సమక్సంలోనే తన విచారణ జరగాలని హైకోర్టును ఆశ్రయించనున్నట్టు కేటీఆర్ వెల్లడించారు. తనకు చట్టపరమైన రక్షణ కల్పించాలని కోరుతానన్నారు. విచారణకు లాయర్లతో రావొద్దని చెబుతున్నారని.. ఇలాగే వెళ్లిన తమ పార్టీ నేత పట్నం నరేందర్ రెడ్డి ఇవ్వని స్టేట్ మెంట్లు ఇచ్చినట్టు బుకాయించారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తనపై అక్రమ కేసులు పెట్టారని, సుప్రీం కోర్టులోనూ న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news