నల్గొండ.. పంజాబ్ అసెంబ్లి ఎన్నికల AICC పరిశీలకులుగా ఉత్తమ్

పంజాబ్ అసెంబ్లి ఎన్నికలకు AICC పరిశీలకులుగా నల్లగొండ పార్లమెంటు సభ్యులు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. స్థానిక నాయకులతో కలిసి అమృతసర్ లోని స్వర్ణ దేవాలయంలోని శ్రీ హర్ మందిర్ సాహిబ్ వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్ లో సిక్కు మత ప్రధాన కేంద్రమైన అకల్ తఖ్త్ ను సందర్శించారు. ఈ సందర్భంగా దేశానికి మానవాళికి సిక్కులు చేసిన సేవలు కొనియాడారు.