యాదాద్రిలో ఘనంగా అధ్యయనోత్సవాలు

yadadri-temple
yadadri-temple

యాదాద్రి-భువనగిరి: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనారసింహుడి క్షేత్రంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా 3వ రోజు ఉదయం శ్రీరామావతారం అలంకారంలో నరసింహ స్వామి దర్శనమిస్తున్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. అలాగే రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామివారిగా యాదగిరషుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు.