గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఉపాధ్యాయుల మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. 317 జీవో ను రద్దు చేయాలంటూ ఉపాధ్యాయులతో పాటు.. ప్రతి పక్షాలు కూడా కేసీఆర్ సర్కార్ పై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా… ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు ఉపాధ్యాయులు.
దీంతో పంజాగుట్ట నుంచి ప్రగతి భవన్ వరకు పోలీసులు భారీగా మోహరించారు. వచ్చిన వారిని వచ్చినట్లు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలిస్తున్నారు పోలీసులు. దీంతో ఇప్పటి వరకు 70 మందికి పైగా టీచర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అసంబద్దంగా ఉద్యోగుల బదిలీలు చేపట్టారని… సీనియార్టీ ప్రకారం కేటాయింపు జరగలేదని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. 317 జీవోతో భార్య భర్తలను విడదీస్తున్నారని.. స్థానిక ఉద్యోగులను వేరే చోటుకు బదిలీ చేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీచర్లు. ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని.. 317 జీవో రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని టీచర్లు వార్నింగ్ ఇచ్చారు..