మేడారం సమ్మక్క సారలమ్మల మహా జాతర సందర్భంగా ఫిబ్రవరి 18 శుక్రవారం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. దీన్ని పురస్కరించుకొని వరంగల్ జిల్లాలో అన్ని విద్యాలయాలు, స్థానిక వాణిజ్య వ్యాపార సంస్థలకు సెలవు దినంగా జిల్లా కలెక్టర్ బి.గోపి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సెలవు రోజు మార్చి 12 రెండవ శనివారం వర్కింగ్ డేగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు.