చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి

accident
accident

చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పూడూర్ మండలం సోమంగుర్ధి గ్రామనికి చెందిన జయప్రకాశ్.. సోమవారం హైదరాబాద్ వెళ్తుండగా మీర్జాగూడ సమీపంలో హైవేపై టిప్పర్ లారీని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. తలకు బలంగా దెబ్బ తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు వికారాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌ పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.