
బస్సు అదుపు తప్పి పొదల్లోకి దూసుకెళ్లిన ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలోని కందనెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. తాండూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నగరానికి బయలుదేరింది. అయితే మార్గమధ్యంలో బస్సు ఒక్కసారిగా పక్కకున్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సు ఎడమవైపు అద్దం పూర్తిగా ధ్వంసమైంది. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.