
నారాయణఖేడ్ మండలం అబ్దుల్లా వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలు సంగారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందారు. మృతులు కంగ్టి మండల గాజుల్ పాడ్‌కు చెందిన పండరి(35), నాగామణి(27)గా గుర్తించారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. భార్యాభర్తల మృతితో గాజుల్ పాడ్‌లో విషాదం నెలకొంది.