భీమ్లా నాయ‌క్ : ప‌వ‌న్ కు స‌పోర్ట్ గా మ‌హేశ్ ఎందుకో తెలుసా?

-

ఇద్ద‌రూ ఒకేసారి కెరియ‌ర్ ప్రారంభించ‌లేదు. కానీ ఇద్ద‌రూ అందుకోని విజ‌యాలంటూ లేవు. బ‌య‌ట అభిమానులు అనుకునేంత ద్వేషం,అసూయ వారి మ‌ధ్య లేవు.ఇక‌పై రావు కూడా! ఇదే మాట పాల‌కొల్లు మ‌హేశ్  బాబు అభిమానులు కూడా చెబుతారు.అదే మాట మొన్న‌టి వేళ భీమ్లా నాయ‌క్ విడుద‌ల సంద‌ర్భంగా ఫ్లెక్సి క‌ట్టి మ‌రీ! త‌మ అభిమానం అనంత‌రం అని చాటారు వాళ్లు. ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో..

మిగ‌తా నాయ‌కులంద‌రి క‌న్నా భిన్నంగా ఉంటారు ప‌వ‌న్..అది రాజ‌కీయంలో! మిగ‌తా హీరోలంద‌రికీ భిన్నంగా ఉంటారు ప‌వ‌న్.. అది సినిమా రంగంలో! ప‌వ‌న్ అంటే ఓ సెల‌బ్రేష‌న్ అన్న విధంగా ఉంటారు.ప‌వ‌న్ అంటే ఓ సెన్సిబుల్ ప‌ర్స‌న్ అనే విధంగా ఉంటారు. సినిమాల గురించి వాటి రికార్డుల గురించి నా ద‌గ్గ‌ర మాట్లాడ‌కండి.అవేవీ ఎల్ల‌కాలం ఉండ‌వు..సాటి మ‌నిషిని ఆద‌రించిన తీరే గొప్ప‌ది అని కూడా అంటారు.ఆ విధంగానే ఉంటారు ప‌వ‌న్. రాజ‌కీయంలో విభేదాలు ఉన్నా కూడా అవ‌ధి దాటి నాయ‌కుల‌ను తిట్ట‌రు. అదేవిధంగా సినిమా నిర్మాణంలో కొన్ని సార్లు ఇబ్బందులు వ‌చ్చినా ప‌వ‌న్ మాత్రం నిర్మాత‌ల‌కు ప్ర‌తిబంధ‌కంగా ఉండ‌రు.

ఇండ‌స్ట్రీలో అంద‌రి హీరోల‌కూ ప‌వ‌న్ అంటే ఇష్టం మ‌రియు అభిమానం కూడా! సినిమాల విష‌య‌మై ప‌వ‌న్ తీసుకునే నిర్ణ‌యాలు ఎలా ఉన్నా కూడా సామాజిక ప‌రంగా ఆయ‌న చేసే ప‌నులంటే ఎంద‌రెంద‌రో ఫిదా అవుతుంటారు.మెగాస్టార్ కుటుంబంలో ప‌వ‌న్ ఓ ప్ర‌త్యేక శైలికి చెందిన వ్య‌క్తి అని,వ్య‌క్తిత్వ రీత్యా ఆయ‌న స్వ‌భావ‌మే విభిన్నం అని,ఎంద‌రినో ఆదుకునే ల‌క్ష‌ణం ఆయ‌న ఒక్క‌రికే సొంతం అని  చెబుతూ చాలా సార్లు చాలా వేదిక‌ల్లో ప‌లువురు క‌థానాయ‌కులు ప్ర‌శంసించిన దాఖ‌లాలు ఉన్నాయి.ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ కు ఇండ‌స్ట్రీలో ప్ర‌త్యేకమ‌యిన ఫ్యాన్ బేస్ ఉంది. అంద‌రి అభిమానుల‌కూ ప‌వ‌న్ అంటే ఇష్టమే అన్న‌ది ఎన్నో సార్లు ప్రూవ్ అయింది కూడా! తాజాగా మరోసారి ప‌వ‌న్ ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు టాలీవుడ్ ప్రిన్స్.

భీమ్లా నాయ‌క్ సినిమా విష‌య‌మై మ‌హేశ్ బాబు అండ‌గా నిలిచారు.ఈ సినిమా చూశాన‌ని, ప‌వ‌న్ అద్భుతంగా న‌టించార‌ని ప్ర‌శంసించారు.అంతేకాదు రానాను సైతం ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తాడు.సినిమా విడుద‌ల సంద‌ర్భంగా మ‌హేశ్ బాబు ఫ్యాన్స్ కూడా జన‌సేనానికి అండ‌గా నిలిచి అభిమానం చాటారు.దీంతో జ‌న‌సేన స‌భ్యులంతా మ‌హేశ్ బాబుకు,ఆయ‌న అభిమానులకు ధ‌న్య‌వాదాలు చెబుతున్నారు. పాల‌కొల్లులో మహేశ్ బాబు అభిమానులు ప‌వ‌న్ కు అభినంద‌న‌లు తెలుపుతూ,శుభాకాంక్ష‌లు చెబుతూ బ్యాన‌ర్ ఏర్పాటు చేశారు.ఇది అక్క‌డ పెద్ద సంచ‌ల‌నం అయింది.

Read more RELATED
Recommended to you

Latest news