సిద్దిపేట జిల్లా తోగుట మండలం వెంకట్రావ్పేట్-జప్తిలింగారెడ్డిపల్లి గ్రామ శివారులో జరిగిన కాల్పుల ఘటనపై పోలీసులు పురోగతి సాధించారు. చెల్లాపూర్ గ్రామానికి చెందిన ఒగ్గు తిరుపతి, అతని మనుమడు శరత్ను అదుపులోకి తీసుకున్న తోగుట సీఐ కమలాకర్, ఎస్ఐ కరుణాకర్ రెడ్డిలు విచారణ చేపట్టారు. వారి నుంచి బైకు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.