
హన్మకొండ జిల్లా ఖాజీ పేట మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. తిలక్ నగర్‌కు చెందిన జయరాజ్ (45) కాజీపేటలో రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జయరాజు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనదారులను అరెస్టు చేశారు.