పరిటాల-జేసీ ఫ్యామిలీలకు క్లారిటీ ఇవ్వు బాబు…!

-

అనంతపురం జిల్లా రాజకీయాల్లో పరిటాల, జేసీ ఫ్యామిలీలకు తిరుగులేదనే సంగతి తెలిసిందే. జిల్లా రాజకీయాల్లో రెండు ఫ్యామిలీలు ఎంత బలమైనవే అందరికీ తెలిసిందే. గతంలో రెండు ఫ్యామిలీలు అపోజిట్‌గా ఉంటూ రాజకీయం చేశాయి. పరిటాల ఫ్యామిలీ టీడీపీలో, జేసీ ఫ్యామిలీ కాంగ్రెస్‌లో పనిచేశాయి. కానీ 2014 నుంచి రెండు ఫ్యామిలీలు టీడీపీలో కలిసి పనిచేస్తున్నాయి.
ఇలా అనంత రాజకీయాల్లో కీలకంగా ఉన్న రెండు ఫ్యామిలీల సీట్ల విషయంలో చంద్రబాబు సరైన క్లారిటీ ఇవ్వడం లేదు. గత ఎన్నికల్లో జగన్ గాలిలో రెండు ఫ్యామిలీలు ఓటమి పాలైన విషయం తెలిసిందే. అది కూడా వారసులు బరిలో దిగి ఓడిపోయారు. రాప్తాడులో పరిటాల శ్రీరామ్, తాడిపత్రిలో జేసీ అస్మిత్ రెడ్డి, అనంతపురం పార్లమెంట్‌లో జేసీ పవన్ రెడ్డిలు పోటీ చేసి ఓడిపోయారు.

అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత త్వరగానే రెండు ఫ్యామిలీలు పికప్ అయ్యాయి. కాకపోతే సీటు విషయంలో క్లారిటీ లేదు. రాప్తాడు పరిటాల, తాడిపత్రి జేసీ ఫ్యామిలీకి ఫిక్స్. కానీ ఎవరు బరిలో దిగుతారో తెలియడం లేదు. అనంత పార్లమెంట్‌లో పవన్ పోటీ చేయడం ఖాయమే. తాడిపత్రిలో మాత్రం జేసీ అస్మిత్ బరిలో దిగుతారా? లేక జేసీ ప్రభాకర్ పోటీ చేస్తారో తెలియడం లేదు. టీడీపీ ప్రభాకర్ మాత్రం తన తనయుడునే బరిలో దింపాలని అనుకుంటున్నారు. కానీ టీడీపీ అధిష్టానం మాత్రం ప్రభాకర్ నిలబడాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది.

అటు రాప్తాడు మాత్రమే కాకుండా ధర్మవరం బాధ్యతలని పరిటాల శ్రీరామ్ చూసుకుంటున్నారు. ఇక ఎన్నికల్లో రాప్తాడు బరిలో సునీతమ్మ, ధర్మవరం బరిలో శ్రీరామ్ పోటీ చేయాలని చూస్తున్నారు. కానీ ధర్మవరం సీటు విషయంలో క్లారిటీ లేదు. ఆ సీటులో ఎవరిని పోటీలో పెడతారో ఇంకా తేలలేదు. దీంతో పరిటాల ఫ్యామిలీకి ఇచ్చే సీట్ల విషయంలో క్లారిటీ లేదు. మరి ఈ రెండు ఫ్యామిలీలకు బాబు ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news