గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి

  • ప‌ర‌కాల ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి
    వ‌రంగ‌ల్ జ‌న‌వ‌రి 6: గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నార‌ని ప‌ర‌కాల ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి అన్నారు. గురువారం ఆయ‌న వ‌రంగ‌ల్ జిల్లా సంగెం మండ‌లంలోని తిమ్మాపూర్‌లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా గ్రామంలో రూ. 66. 10 ల‌క్షల‌తో నూత‌నంగా నిర్మించిన ప‌ల్లె ప్ర‌కృతి వ‌నం, బృహ‌త్ ప్ర‌కృతి వ‌నం, శ్మ‌శాన వాటిక డంపింగ్ యార్డుల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందుతేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని భావించి సీఎం కేసీఆర్ గ్రామాలకు అత్యధిక నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ హయాంలో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుంద‌ని తెలిపారు. పట్టణాలకు ధీటుగా పల్లెలు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయ‌న్నారు. సంగెం తిమ్మాపూర్ గ్రామాల మధ్యలో ఉన్న పాత బ్రిడ్జి స్థానంలో రూ.1కోటి 20 లక్షలు నూతన బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు అయినట్టు చెప్పారు. త్వరలోనే మండలంలో ధాన్య నిలువ కోసం 25వేల మెట్రిక్ టన్నుల గోదాము మంజూరు చేయ‌నున్న‌ట్టు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో మండ‌ల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, స‌ర్పంచులు, సొసైటీ చైర్మ‌న్లు, మార్కెట్ డైరెక్ట‌ర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.