మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కె.శశాంక ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత సమయంలోగా నాణ్యత లోపించకుండా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.