వరంగల్: పోలీస్ స్టేషన్ లో కలవరపెడుతున్న కరోనా

పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. రెండు రోజుల కిందటి వరకు 9మందికి కరోనా రాగా ప్రస్తుతం మరో ముగ్గురికి వ్యాపించింది. ఇందులో ఒక ఎస్సైతో పాటు ఇద్దరు డ్రైవర్లున్నారు. మొత్తం 12మంది అధికారులు, సిబ్బంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు. దీంతో స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న వారు ఆందోళన చెందుతున్నారు.