సంక్రాంతి పండుగ తరువాత జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి.పేకాటలు,బెట్టింగ్ లు అయిపోయాయి. క్యాబెరేలు, క్యాసినోలు కూడా అయిపోయి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. పాపం పోలీసులు ఏమీ మాట్లాడకుండా ఉన్నారు. ఎందుకంటే అధికార పార్టీ ఏం చెబితే అదే చేయాలి కనుక వాళ్లను మనం ఏమీ అనలేం.
పోనీ క్యాసినో తరువాత ఏమయినా మార్పులు జరిగాయా అంటే జరగలేదు గుడివాడలో! అంటే సీఐ గోవింద రాజు కానీ మరొకరు కానీ మీడియాకు ఏమీ చెప్పం అని తెగేసి చెప్పేశారు. అలాంటప్పుడు న్యాయం గెలుస్తుందని ఎలా అనుకోగలం. నిజనిర్థారణకు వెళ్తాం అన్న టీడీపీపై రాళ్లు రువ్విన వారిపై కేసులు పెట్టి వారిని కోర్టుకు హాజరు పరచడం సాధ్యమేనా?
ఇక సంక్రాంతి తరువాత మరియు ఆ పండగ రోజుల్లోనూ జనాలను జ్వరాలు వణికించాయి. ఒమిక్రాన్ భలే ఇబ్బంది పెట్టింది. కొద్ది పాటి లక్షణాలున్నా కూడా పాపం జనాలు ఆస్పత్రులకు పోకుండా కొన్ని స్వీయ జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు.ఆ విధంగా సమీప మెడికల్ షాపులు కూడావీళ్లకు అంతో ఇంతో సాయం చేశాయి. ఈ సారి మెడికల్ మాఫియా అంత జోరుగా లేదు లేండి. పారసిటమాల్ మందు సరిగా అమ్మితే చాలు వాళ్లు కాస్తో కూస్తో ఎందరో పేదలకు సాయం చేసిన వారే! కనుక డోలో 650 మందు బాగానే కుదురుకుంది.
ఆ ఒక్క మందు ప్రభావంతో చాలా మంది జ్వరాల నుంచి బయటపడ్డారు. వీటితో పాటు చిన్న చిన్న మెడికల్ షాపుల్లో కొన్ని యాంటి బయాటిక్స్ కూడా కొనుగోలు చేసి ఈ ఏడాది గండం నుంచి అంతా గట్టెక్కారు. ఇక చదువులు కూడా సాఫీగానే సాగిపోతున్నాయి. ఏదేమయినప్పటికీ మంత్రి ఆదిమూలం తీసుకున్న నిర్ణయం కారణంగా చదువులు అయితే ఎక్కడా ఆటంకం లేకుండానే వెళ్తున్నాయి.
ఇదే సమయంలో తెలంగాణ వాకిట ఈ నెలాఖరు వరకూ స్కూళ్లకు సెలవులు ఇచ్చారు కేసీఆర్. అదేవిధంగా హరీశ్ రావు (వైద్య ఆరోగ్య శాఖ మంత్రి) నేతృత్వంలో పల్లెల్లో ఫీవర్ సర్వేలు శరవేగంగా జరుగుతున్నాయి.అదేవిధంగా కరోనా కిట్ పంపిణీ కూడా బాధితులకు అందిస్తున్నారు. దీంతో అటు తెలంగాణ కూడా కాస్త తెరిపిన పడిందనే చెప్పాలి. కేసుల సంఖ్య పెరిగినా మరణాలు లేకపోవడంతో అధికార యంత్రాంగం అంతా ఊపిరి పీల్చుకున్నారు.
నార్త్ లో కూడా ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కదిద్దుకుంటు న్నాయి. సంక్రాంతి తరువాత మరో రెండు నెలలు ఇలానే ఉన్నా కూడా మరణాలు ఉండవు అని తేలిపోయింది. కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగి తరువాత తగ్గిపోవడం అన్నది మంచికే అన్న భావన ఒకటి స్థిరపడిపోయింది.