వరంగల్ : పంట నష్టం సర్వేను త్వరగా అందించాలి: మంత్రి

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల కురిసిన వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ఆదివారం హనుమకొండ కలెక్టరేట్‌లో పంట నష్టాల అంచనాలు, కొవిడ్ వ్యాప్తి నివారణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పంటల నష్టాల నివేదికలను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, అధికారులున్నారు.