వరంగల్ : దళితబంధు ఎంపిక పూర్తి : కలెక్టర్‌

వరంగల్ జిల్లాలో దళితబంధు లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందని కలెక్టర్‌ బి.గోపి తెలిపారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో దళితబంధు లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలెక్టర్‌ మాట్లాడుతూ.. దళితులను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు సంబంధిత అధికారులతో సంప్రదించాలన్నారు.