వరంగల్ : బందోబస్తుకు వెళ్లి మేడారం అడవుల్లో శవమై..

ములుగు జిల్లా మేడారం జాతర బందోబస్తుకు డ్యూటీ నిమిత్తం వచ్చి తప్పిపోయిన హోంగార్డు శుక్రవారం శవమై కనిపించాడు. నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన మైలారం లక్ష్మణ్ ఫిబ్రవరి 17న మహాజాతర సందర్భంగా బందోబస్తుకు వచ్చాడు. 4 రోజుల పాటు డ్యూటీ చేయగా తిరిగి ఇంటికి వెళ్లలేదు. ఎన్నిరోజులు వేచి చూసినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుండి గాలించగా నేడు మృతదేహం లభ్యమైంది.