ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులను ఆదుకుంటాం: సీఎం

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు తప్పకుండా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు.

ఉమ్మడి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో జనవరి నెలలో మిర్చితో పాటు ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నివేదిక సమర్పిస్తే ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని సీఎం స్పష్టం చేశారు.