పంజాబ్ సీఎంగా భగవత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్ రాష్ట్రానికి 17వ సీఎంగా భగవంత్ మాన్ పదవిని చేపట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత తాను రాజ్ భనవ్ లో ప్రమాణ స్వీకారం చేయనని.. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామం ఖట్కార్ కలాన్ వేదికగా ప్రమాణ స్వీకారం చేస్తానని భగవంత్ మాన్ ప్రకటించారు. ఇందుకు తగ్గట్లుగానే ఖట్కార్ కలాన్ ఊరిలో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్, భగవంత్ మాన్ తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు కీలక ఆప్ నేతలు హాజరయ్యారు. కొత్తగా సీఎంగా బాధ్యతలు చెపట్టిన భగవంత్ మాన్ మాట్లాడుతూ… కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అహంకారంగా ప్రవర్తించకూడదని అన్నారు. కేజ్రీవాల్ కు ధన్యవాదాలు తెలపారు. భగవంత్ మాన్ ప్రమాణ స్వీకరానికి పంజాబ్ నలుమూల నుంచి ప్రజలు తరలివచ్చారు.బ
పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన భగవంత్ మాన్
By Advik
-