MHBD: అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సిమెంటు ఇటుకల లోడుతో వేగంగా వెళ్తున్న ఓట్రాక్టర్ నర్సింహులపేట మండల కేంద్రంలో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో చిన్నగూడూరు మండలం గుండం రాజుపల్లి గ్రామానికి చెందిన వెంకన్న అనే వ్యక్తి దుర్మరణం చెందినట్లు స్థానికులు తెలిపారు.