వరంగల్ పర్యటనకు వచ్చిన సందర్బంగా ఖిలా వరంగల్‌ను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో పాటు సినీనటుడు హీరో సుమన్ ఆదివారం సందర్శించారు. ఖిలావరంగల్ లోని శిల్పాలను, చరిత్రను, వాటి ప్రాముఖ్యతను హీరో సుమన్‌కు ఎమ్మెల్యే, నన్నపునేని నరేందర్ వివరించారు. ఖిలా వరంగల్ అద్భుతంగా ఉందని, కాకతీయుల కళా సంపదకు ఇది చిహ్నం అని అన్నారు. గొప్ప పర్యాటక క్షేత్రంగా ఈ ప్రాంతం వెలుగొందుతోందని హీరో సుమన్ అభిప్రాయపడ్డారు