హనుమకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం

హనుమకొండ జిల్లా ఓగులాపురం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హనుమకొండ నుండి ములుగు వైపు వస్తున్న ఆటో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పెట్రోల్ బంక్ గోడను ఢీకొని బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడుకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.