ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. నిన్న భారీగా పెరిగిన కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం…ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 984 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,82, 843 కి పెరిగింది.
ఒక్క రోజు వ్యవధిలో ఒక్కరు కూడా చనిపోలేదు. దీంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 505 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5606 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 152 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 62 , 732 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 24, 280 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3, 16, 30, 231 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
#COVIDUpdates: 10/01/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,79,948 పాజిటివ్ కేసు లకు గాను
*20,59,837 మంది డిశ్చార్జ్ కాగా
*14,505 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 5,606#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/syc9gg7SLl— ArogyaAndhra (@ArogyaAndhra) January 10, 2022